కథ : క్షమించు కన్నా! రచన : బాపురం నరహరి రావు. అనంతపురము. "క్షమించు కన్నా!" ఆఫీస్ కు టైమైపోతూ ఉందని అనుకుంటూ అద్దం ముందు నిలబడి త్వరత్వరగా జడ వేసుకుంటూ ఉంది రాగిణి. ఇంతలో తలపై తెల్ల వెంట్రుక ఒకటి కనబడటంతో దానిని లోపలకు సర్దింది. వెంటనే అమ్మ దగ్గరకు వెళ్ళి "అమ్మా! మనం మొన్న పెళ్ళి చూపులకు విజయ్ మోహన్ వచ్చాడు కదా! అతన్తో పెళ్ళికి ఒప్పుకున్నానని వారికి కబురు చేయి" అంది. "అదేంటే!? రెండో పెళ్ళివాడు. పైగా మూడు సంవత్సరాల బాబు ఉన్నాడు అని వద్దంటివి కదా!?" "పర్లేదు. వాళ్ళింటి దగ్గర మా ఆఫీస్ లో కొలీగ్ శ్యామల ఉంటోంది. తను చెప్పింది...విజయ్ చాలా మంచివాడని. అదీకాక నాక్కూడా ముప్ఫై రెండేళ్లు వచ్చాయి. ఇలా వద్దంటూ పోతే చివరకు బ్రహ్మచారిణిలా మిగిలిపోవాలంతే" అంటూ బలవంతంగా నవ్వింది. ఏదేమైనా రాగిణి పెళ్ళికి ఒప్పుకుందని సంతోషపడింది వినోదిని.