అల్లసాని పెద్దనగారు ఆశువుగా చెప్పిన ముప్పది పాదమ్ముల పద్యం. ఆయనను ఆరోజు రాయలవారు గండపెండేరంతో సత్కరించారు. తెలుగులో అతి పెద్ద పద్యములలో నొకటిగా ప్రసిద్ధి పొందింది. నిన్ననే తనికెళ్ళ భరణి గారి నోట విన్నాను. (Poem in captions) ****************************** పూత మెరుంగులున్ బసరు పూపబెడంగులు జూపునట్టి వా కైతలు? జగ్గు నిగ్గు నెన గావలె గమ్మున గమ్మనవలెన్ రాతిరియున్ బవల్ మరపురాని హొయల్ చెలియారంజంపు ని ద్దాతరితీపులోయనగ దారసిలన్వలె లో దలంచినన్ బాటిగ బైకొనన్వలెను బైదలి కుత్తుకలోని పల్లటీ కూతలనన్వలెన్ సొగసు కోర్కులు రావలె నాలకించినన్ జేతికొలంది కౌగిటను జేర్చిన కన్నియ చిన్ని పొన్ని మేల్