Nojoto: Largest Storytelling Platform

ఉండీ లేకపోవడం కన్నా లేకుండా ఉండిపోవడం బావుంటుందేమ

ఉండీ లేకపోవడం కన్నా 
లేకుండా ఉండిపోవడం బావుంటుందేమో 
ఉండటానికి లేకపోవడానికి మధ్య 
ఎటూ కాకుండా పోయేకన్నా 
ఎటువైపో ఒకవైపు ఒరిగి జరిగి నిలబడ్డమే 
ప్రధానమేమో మరి...
నీది కాకుండా నువ్వు చేసుకున్న మనసు 
ఇప్పుడు నీ మనుగడకే ప్రమాదమైంది 
నీలో లేకుండా నువ్వు పంచేసుకున్న భావం
ఎప్పుడో నీ పవిత్రతని చంపేసింది 
ఇంకెంత ఏటో ఒకవైపు ఒరిగి నిలబడక 
నిరంతరం నిన్ను నువ్వు ప్రశ్నించుకోవడం 
నీకావలిసింది నీ ఉనికే 
నీది మాత్రమే అయిన నీ ఉనికి 
అది నీ స్వలాభమే కావొచ్చు 
స్వప్రయోజనమే కావొచ్చు 
రాగద్వేషాల్ని అనుభవించాలన్నా 
రాతిబండలా మిగిలి పోవాలన్నా 
ముందు నిన్ను నువ్వు జీవింపచేసుకోవాలి 
ఎవరో ఏంటో వాళ్ళకే తెలియని 
అనాసక్త అనామక హృదయాలకు 
నిన్ను నువ్వెందుకు అర్పించుకోవడం 
నీ సహృదయంతో నీకు నువ్వుగా ఫరిడవిల్లితే ఆ ప్రభే వేరు

©gopi kiran
  #cloud
gopikiran7359

gopi kiran

Bronze Star
New Creator
streak icon93

#cloud

72 Views