Nojoto: Largest Storytelling Platform

ప్రపంచం పడుకుంది తన అరుపులు వినిపించవులే... ప్రపం

ప్రపంచం పడుకుంది 
తన అరుపులు వినిపించవులే...
ప్రపంచం మేలుకుంది
తన విచారం గుర్తించబడదులే... 
తనకు ప్రపంచానికి చాలా దూరం. 
మధ్యలో ఓ ప్రపంచం ఉంది
గాలిమేడనెక్కిస్తూనే
పాతాళానికి పడదోస్తూ...
పూలను చూపిస్తూనే ముళ్ళను పరుస్తూ...
జీవం నాటకం 
జీవితం బూటకం
ఎండమావులకై పడిగాపులు
ఎదలాలసకై కన్నీటిఅడుపులు
ఊహావిహారి సమాయాహారి 
మిథ్యానగరి తనుప్రహరి
పరువుకు వేలం భవిత
అరువుకు గాలం కవిత
వేదాంత వెక్కిరింత 
ఆద్యంత కలవరింత
మనసుకు ముసుగును కుట్ట వాసమేది!
కనుతలుపులకు తాళమేయ ఉపాయమేది?
అయోమయం తనతో 
ఆందోళన తనలో
ఆవేదన తనై పుట్టిపెరిగి 
కాలం కథలో కదులుతూ
తన కథలో తనని తొక్కుతూ
గమ్యం వైపు పరుగు 
గాయమైంది అరుగు 
ముళ్ళు మిగిలిన కాడ 
నేలకొరిగిన గులాబీరేకుల్తో తను...
- srilatha lion💘 #తను #మనసుచప్పుడు #మౌనరాగం #telugu
ప్రపంచం పడుకుంది 
తన అరుపులు వినిపించవులే...
ప్రపంచం మేలుకుంది
తన విచారం గుర్తించబడదులే... 
తనకు ప్రపంచానికి చాలా దూరం. 
మధ్యలో ఓ ప్రపంచం ఉంది
గాలిమేడనెక్కిస్తూనే
పాతాళానికి పడదోస్తూ...
పూలను చూపిస్తూనే ముళ్ళను పరుస్తూ...
జీవం నాటకం 
జీవితం బూటకం
ఎండమావులకై పడిగాపులు
ఎదలాలసకై కన్నీటిఅడుపులు
ఊహావిహారి సమాయాహారి 
మిథ్యానగరి తనుప్రహరి
పరువుకు వేలం భవిత
అరువుకు గాలం కవిత
వేదాంత వెక్కిరింత 
ఆద్యంత కలవరింత
మనసుకు ముసుగును కుట్ట వాసమేది!
కనుతలుపులకు తాళమేయ ఉపాయమేది?
అయోమయం తనతో 
ఆందోళన తనలో
ఆవేదన తనై పుట్టిపెరిగి 
కాలం కథలో కదులుతూ
తన కథలో తనని తొక్కుతూ
గమ్యం వైపు పరుగు 
గాయమైంది అరుగు 
ముళ్ళు మిగిలిన కాడ 
నేలకొరిగిన గులాబీరేకుల్తో తను...
- srilatha lion💘 #తను #మనసుచప్పుడు #మౌనరాగం #telugu