నీ అంతరంగ స్పందనకు ప్రతిస్పందనయైన నీ బాహ్య స్పందనకు ప్రతిస్పందించిన వారి స్పందనకు నువు ప్రతిస్పందించడం నీ కనీస ధర్మం ఎందుకంటే ప్రతీ స్పందనకీ ప్రతిస్పందన కలుగుతుందని ఖచ్చితంగా నిర్దారించలేం. కాని ప్రతిస్పందన కలిగిందంటే మాత్రం వాళ్ళ మనసుని నీ స్పందన కదిలించిందనే అర్ధం మెలిపెట్టి ముద్దాడిందనే అర్ధం గిల్లి గడుసుగ చోద్యం చూసిందనే అర్ధం తీరైన గమకాలతో జోలపాడిందనే అర్ధం రోమాలు నిక్కపొడిచేలా తట్టి లేపిందనే అర్ధం