నన్ను నీవు చూస్తుంటే..గగనాలకు ఇష్టమట..! నీవు నన్ను చుట్టేస్తే..మేఘాలకు ఇష్టమట..! అందమైన దేదైనా..అందనిదే అంటాను.. నీవు-నేను ఒకటైతే..స్వప్నాలకు ఇష్టమట..! కలవాలని ఎంతున్నా..కలవవులే తీరాలు.. ఏకత్వపు భావనమే..కలహాలకు ఇష్టమట..! ఈ మాటల కోవెలలో..దీపంలా మౌనమే.. ఎదలోయల పరిమళమే..రాగాలకు ఇష్టమట..! వేదనలకు ఔషధమే..వెన్నుతట్టు చెలిమిలే.. వేషాలను మానేస్తే..హృదయాలకు ఇష్టమట.... #notojotelugu #Goodmorning