కళ్ళతో మాటాడుతూ మనసుతో వింటుంటే ఎంత బావుంటుందో తెలుసా! అచ్చం పున్నమి వెన్నెల్లో సొగసులద్దుకునే సంద్రపు అలలా... నావైపు పైకి మాటల్లేకపోవచ్చుగాని మనసంతరంగంలో నువ్వూహించలేనంత సవ్వడి.. అన్నీ మూటగట్టి ఓ చిన్ని అరనవ్వులో నింపేస్తా నీకోసం... చీకటి రాజ్యానికి తారాజువ్వల వర్షంలా.. ఏం చెయ్యను తాకలేదు తపన ఆస్వాదిస్తూనే అంబరానికి ఎగిరిపోతు... చేరలేదు యాతన ఐనా... దూరానున్నా... అరచేతుల ఆలింగనాన్ని ఊహిస్తూ... నేనలా నిదురలోకి జారిపోతే నీ తలపొచ్చి అలా.... గిల్లిపోతే అక్షరాలిలా అలుకుతూ... ఆనందపడుతూ... #కళ్ళు #మాటలు #telugu #teluguvelugu