Nojoto: Largest Storytelling Platform

**రంగు** ఎగిరే జందాకు అర్ధాన్నిస్తుంది చూపుకు కను

**రంగు**

ఎగిరే జందాకు అర్ధాన్నిస్తుంది
చూపుకు కనువిందుగా అనిపిస్తుంది
రాతకు అందాన్నిస్తుంది
రంగవల్లులకు కలనిస్తుంది
బట్టలకు పేరునిస్తుంది
ఆభరణాలకు ఊరటనిస్తుంది
బొమ్మలకు ప్రాణం పోసినట్టు చేస్తుంది
పువ్వులకు గుర్తింపు ఇస్తుంది
భవనానికి ఆకర్షణా శక్తినిస్తుంది
ప్రకృతిని అందంగా చూపిస్తుంది

స్వచ్ఛతకు గుర్తు, ఆనందానికి గుర్తు, ఆప్యాయతకి గుర్తు ఈ రంగు
ప్రతీ రంగుకు తమ తమ ప్రత్యేకత ఉన్నట్టుగానే 
వివిధ మనస్తత్వాలు గల మనుష్యులకు కూడా వారి వారి ప్రత్యేకత ఉంటుంది మిత్రమా 
అది గుర్తించక పోయిన పర్వాలేదు కానీ వారి తత్వాన్ని కించపరచకండి

©Jyothirmayee Mukkamala
  #colours importance

#colours importance #Poetry

89 Views