Nojoto: Largest Storytelling Platform

ఎవ్వరూ తారసపడరే ఈ కాగిత దారిలో కలం వాహనానికి ఆలో

ఎవ్వరూ తారసపడరే 
ఈ కాగిత దారిలో కలం వాహనానికి 
ఆలోనలు,జ్ఞాపకాలనే జోడెద్దుల బండోలె 
ఘల్లు ఘల్లుమంటూ ఒక్కతే పరిగెడుతుంది 
స్వేచ్ఛగా అదే సమయంలో ఒంటరిగా...
స్వేచ్ఛ ఆలోచనల్ని సృజియిస్తే 
ఒంటరితనం జ్ఞాపకాల్ని తట్టిలేపుతుంది
ఆలోచనలేమో స్వేచ్ఛ వదులు చేతులలో 
ఒంటరితనమేమో జ్ఞాపకాల గుప్పిట్లో
రెండూ నావే...రెండూ నాతోనే...
వదలమంది హత్తుకుంటానంటూ
హత్తుకోమంది తరుముతానంటూ 
మాట వినక ఘర్షణకు దిగుతుంటే...
చేసేదేముంది
ఉన్న ఈ అక్షరస్వేచ్ఛతో జ్ఞాపకాల గుప్పిలి నుండి 
అక్షరాల్ని వెదజల్లుతూ పోవడమే. 

కాగిత దారిలో కలంతో నేను. #అక్షరస్వేచ్ఛ #జ్ఞాపకాలు #yqkavi #teluguvelugu #గుప్పిలి #ఒంటరితనం #కాగితం #కలం
ఎవ్వరూ తారసపడరే 
ఈ కాగిత దారిలో కలం వాహనానికి 
ఆలోనలు,జ్ఞాపకాలనే జోడెద్దుల బండోలె 
ఘల్లు ఘల్లుమంటూ ఒక్కతే పరిగెడుతుంది 
స్వేచ్ఛగా అదే సమయంలో ఒంటరిగా...
స్వేచ్ఛ ఆలోచనల్ని సృజియిస్తే 
ఒంటరితనం జ్ఞాపకాల్ని తట్టిలేపుతుంది
ఆలోచనలేమో స్వేచ్ఛ వదులు చేతులలో 
ఒంటరితనమేమో జ్ఞాపకాల గుప్పిట్లో
రెండూ నావే...రెండూ నాతోనే...
వదలమంది హత్తుకుంటానంటూ
హత్తుకోమంది తరుముతానంటూ 
మాట వినక ఘర్షణకు దిగుతుంటే...
చేసేదేముంది
ఉన్న ఈ అక్షరస్వేచ్ఛతో జ్ఞాపకాల గుప్పిలి నుండి 
అక్షరాల్ని వెదజల్లుతూ పోవడమే. 

కాగిత దారిలో కలంతో నేను. #అక్షరస్వేచ్ఛ #జ్ఞాపకాలు #yqkavi #teluguvelugu #గుప్పిలి #ఒంటరితనం #కాగితం #కలం