ఎన్నో కలలు ఇంకేవో ముచ్చట్లు నేనంటే నేనని దెబ్బలాడుకుంటున్నాయ్ నా మతితో... హ హ నా మనసు మాత్రం కాస్త ఆగండే! మీగోల మరీను నన్ను కాస్త ఆలోచించుకోనివ్వరే అన్నాన్నేను పళ్ళు కొరుకి ఉరిమిచూస్తూ... అపుడవి మళ్ళీ అడిగాయ్ మొహం తిప్పుతూ నొక్కి వక్కానించినట్టుగ ఇంతకీ ఏవిటో తమరి ఆలోచన అనగానే... నా మనసంది ఓ అద్భుతాన్ని సృష్టించాలి అని అనంత శోభనేదో కళ్ళలో నింపుకుని నింగికేసి చూస్తూ... #అద్భుతం #నేను_నా_పిచ్చి #నేను_నా_ఆలోచనలు #yqbaba #yqkavi #telugu #teluguvelugu