Nojoto: Largest Storytelling Platform

చూడచక్కని చిరునవ్వు, ప్రశాంత వదనం కళ్ళనిండా ఆశా ద

చూడచక్కని చిరునవ్వు, 
ప్రశాంత వదనం
కళ్ళనిండా ఆశా దృక్పదం, 
కుదురుగున్న కనుబొమ్మలు
రంగులద్దిన కురులు, 
శిల్పి చెక్కినట్లు మీసము
కొలిచినట్లున్న ఏటవాలు నాసికము
దృఢమైన చెక్కిళ్ళు, విశాలమైన నుదురు
చేతికి అందమైన గడియారం, 
మెరిసిపోతున్న తెల్లని వస్త్రాలు 
ఇలా అచ్చంగా విచ్చుకున్న ముఖారవిందము చూడగానే
మనస్సున ఎదో ఆనందం చేరువైనది
అసలు ఎవరు ఈ హీరో?
ఇతనొక బిడ్డకు నాన్న,ఆ బిడ్డకు తనే హీరో..!
అల్లరి చేసినా, తప్పులు చేసినా క్షమించేది ఎవరు
అలిగినా, మారాము చేసినా బుజ్జగించేది ఎవరు
క్రిందపడినా, అలసినా ధైర్యం చెప్పేది ఎవరు
కష్టమొచ్చినా, కన్నీరొచ్చినా ప్రేమగ తుడిచేది ఎవరు
ప్రపంచాన్ని పరిచయం చేసి, ప్రమాదాలను విపులీకరించి ముందుండి ప్రోత్సహించేది ఎవరు
చివరకు మాట వినకుండా ఎదురించినా, సమాజంలో చులకన చేసి స్వార్థంగా ఆలోచించినా
తన బిడ్డని ఓ మాట అన్నా సహించని ఆ వ్యక్తిని, నిస్వార్థ ఆ ప్రేమని ఎలా మరువగలం
ఇంకెవరిలో ఎలా పొందగలం!
ఎన్ని కష్టాలున్నా మీ నాన్న ఎలా నవ్విగలిగేవాడో ఈ ఫోటోలోలా 
బహుశా చిరు నవ్వునే బిడ్డకు తన గుర్తుగా అందించాడేమో
ఎన్ని కష్టాలు వచ్చినా నవ్వుని వదలొద్దని
ఆ నవ్వులోనే తానుంటానని ~సూర్య టి

©Suryaa In memory of my friend's dad

suryaa9894124782947

Suryaa

New Creator