మాట ఎళ్లదు భాష లేక, భాష తోటే మాట పలుకు, తల్లి నేర్పినట్టి భాషరా, అ అంటే అమ్మ అని తెలియజేసే భాషరా, నీ మొదటి ఏడుపు ఘోషరా, తెలుగు వెలుగు బాటలో తెలుగోడా, ఓ తెలుగోడా, మాతృభాష పైన పరభాష ఆధిపత్యం ఏమిరా, భాషతోనీ యాసతోని మనకు గుర్తింపు వచ్చురా, అఖండ భారతావనిలో ఎనిమిదికోట్ల ప్రజాస్వరం ఈ తెలుగురా, పరభాష పెత్తనాన్ని గళమెత్తి బెదిరించారా, తెలుగు భాష గొప్పతనం చాటిచూపరా, మాతృభాష విలువ సమాజానికి నేర్పరా. - krtrstate #Telugu #telugukavithalu #telugupoetry #krtrstate #krtrstate_chitti #teluguquotes #telugupoem #InspireThroughWriting