Nojoto: Largest Storytelling Platform

ఇక నన్ను నేను నీ చిరునవ్వుల్లో వెతుక్కుంటాను నీ అ

ఇక నన్ను నేను నీ చిరునవ్వుల్లో వెతుక్కుంటాను 
నీ అడుగుల్లో నా నడకను దాచుకుంటాను 
నా ఉనికిని ప్రపంచం వేలెత్తి చూపించిన వేళ 
తలెత్తి నిన్ను గర్వంగా చూపిస్తాను 
యుగాలనాటి విశ్వసనీయత అంతా 
ఒక్క నీ నుంచి మాత్రమే తీసుకుని 
నన్ను నేను గర్వంగా ప్రతిష్టించుకుంటాను 
నీ అనుమతితో అమరత్వాన్ని ఆపాదించుకుని నా ఆకాంక్షలు 
అజరామరమైన చరిత్రని సృష్టిస్తాయి 
ఇక నన్ను నేను నిన్నుగా ప్రకటించుకుంటున్నాను 
ఏ జన్మకి ఇక నేను నేను కాలేను నువ్వు తప్ప

©gopi kiran
  #poem #Poetry #kavi #kavithalu