తన పెనిమిటి మొగమెతికే నెలపొడుపును సూడగనే మురిసెనెంతొ ఇంటాయన కనుమెరుపును సూడగనే పుష్పమల్లె చూసుకొనగ పొలముదున్ను హాలికుడే కష్టమేమి గురుతే సతి సంబురమును సూడగనే చేదోడై చెంగట్టుకు చెమటచుక్క జారనీదె సంకటిచ్చి ఆకలన్న పతి కడుపును సూడగనే పగలంతటి ఎదురుసూపు దాచుంచిన కొంటెతలపు పట్టుమనీ క్షణమిడదె మల్లె కరమును సూడగనే ఎంత పొగుడు మాట కొరతె ఆలుమగలు లతలల్లే అల్లుకొనగ కనువిందిక తర తరమును సూడగనే #గజల్ #ఆలుమగలు #yqkavi #telugu #teluguvelugu #yqbaba #lovelylife #husband_wife