Nojoto: Largest Storytelling Platform
nareshreddyaleti8121
  • 3.1KStories
  • 0Followers
  • 0Love
    0Views

Naresh Reddy Aleti

  • Popular
  • Latest
  • Video
85ec0ca39cec88d13a54fb5a8cf1f8d5

Naresh Reddy Aleti

ఆ దేవుడు సత్యమైతే
ఈ మతమెక్కడిది?
ఈ మతం సత్యమైతే
ఆ మతం ఎక్కడిది?

కనిపించే సృష్టంతా
నీ సృష్టే #వన్నెలయ్య_రెక్కలు #రెక్కలు #మతం

#వన్నెలయ్య_రెక్కలు #రెక్కలు #మతం

85ec0ca39cec88d13a54fb5a8cf1f8d5

Naresh Reddy Aleti

పెంచిన ప్రేమే వల వేస్తే
చిక్కింది
హాయనుకున్న నీరే ముంచేస్తే
తడిసింది

క-న్నీటిలో
చేప #మత్స్యకారులు #మత్స్యం #చేప #fish
వన్నెలయ్య_రెక్కలు
ప్రపంచ మత్స్యకారులు దినోత్సవం సందర్భంగా

#మత్స్యకారులు #మత్స్యం #చేప #fish వన్నెలయ్య_రెక్కలు ప్రపంచ మత్స్యకారులు దినోత్సవం సందర్భంగా

85ec0ca39cec88d13a54fb5a8cf1f8d5

Naresh Reddy Aleti

సంద్రమెంత గొప్పదైనా పడవ క్రిందే ఒరవడి
దుఃఖం పెద్దదైనా నీ గుండె సడిదే అలికిడి #వన్నెలయ్య_దోహాలు

#వన్నెలయ్య_దోహాలు

85ec0ca39cec88d13a54fb5a8cf1f8d5

Naresh Reddy Aleti

నాలుగు మహావాఖ్యాలే నా హృదయం నేస్తాలు
చేతన నింపే విత్తులే నా అడుగుల రాస్తాలు #వన్నెలయ్య_దోహాలు #దోహా

#వన్నెలయ్య_దోహాలు #దోహా

85ec0ca39cec88d13a54fb5a8cf1f8d5

Naresh Reddy Aleti

కదులుకుంటూ కదిలిస్తూ అక్షరంగా మారాను.! 
తిరిగి చూస్తే జనానికే దూరంగా పోయాను.! #వన్నెలయ్య_దోహాలు

#వన్నెలయ్య_దోహాలు

85ec0ca39cec88d13a54fb5a8cf1f8d5

Naresh Reddy Aleti

నేనెవ్వరిని తప్పననూ ఎవ్వరితో ఇమడలేను
చెప్పలేను ఎందుకనో అక్షరాన్ని మరువలేను #వన్నెలయ్య_దోహాలు

#వన్నెలయ్య_దోహాలు

85ec0ca39cec88d13a54fb5a8cf1f8d5

Naresh Reddy Aleti

ఎవరులేని ఎడారిలో నేనిప్పుడు ఒంటరిని
అయినా నే పచ్చనైనా కవిత్వాల వల్లరిని #వన్నెలయ్య_దోహాలు

#వన్నెలయ్య_దోహాలు

85ec0ca39cec88d13a54fb5a8cf1f8d5

Naresh Reddy Aleti

తీయనైనా ప్రేమలతో అల్లుకుంటు పోయాను
బాధిస్తే బంధ-నాలే విప్పుకుంటు వచ్చాను #వన్నెలయ్య_దోహాలు #దోహా #దోహాలు

#వన్నెలయ్య_దోహాలు #దోహా #దోహాలు

85ec0ca39cec88d13a54fb5a8cf1f8d5

Naresh Reddy Aleti

మురిసిపోయి తలపైనా కదులుతున్నది పింఛము
బృందావన ఓ కృష్ణా మా కెప్పుడా స్తానము #వన్నెలయ్య_దోహాలు 33 #దోహా #దోహాలు

#వన్నెలయ్య_దోహాలు 33 #దోహా #దోహాలు

85ec0ca39cec88d13a54fb5a8cf1f8d5

Naresh Reddy Aleti

                                             మనసా....
ఒక్క పేరునె ఎన్ని రోజులు స్మరిస్తుంటావు.!
కోరి ఎందుకు శోక సంద్రం ధరిస్తుంటావు.!
                                             మనసా....
దాటి వచ్చిన దారులపై ప్రీతి దేనికని?
గతము నిశిలో ఎంతకాలం చరిస్తుంటావు.!
                                             మనసా....
ఓడిపోయిన కథను తలచి ఏం లాభం?
విఫల ప్రేమకు దర్శకత్వం వహిస్తుంటావు.!
                                             మనసా....
నిన్ను మొసి దేహమంత ఊష్ణమయ్యింది
ఎంత పాపం, తనువు కూడా దహిస్తుంటావు.!
                                             మనసా....
ప్రేమ కావ్యం నిండిపోయిన హృదయమా..
వన్నెలోడి అక్షరములో ధ్వనిస్తుంటావు.! #వన్నెలయ్య_గజల్ 365
#వన్నెలయ్య_విఫల_ప్రేమ_గజల్
#గజల్

#వన్నెలయ్య_గజల్ 365 #వన్నెలయ్య_విఫల_ప్రేమ_గజల్ #గజల్

loader
Home
Explore
Events
Notification
Profile