Nojoto: Largest Storytelling Platform

కవనాల పవనాలు నింపింది పుస్తకం.! భావాల గంధాలు పంచిం

కవనాల పవనాలు నింపింది పుస్తకం.!
భావాల గంధాలు పంచింది పుస్తకం.!

జననాలు మరణాలు చూశాను మట్టిలో
కాలాల సాక్ష్యమై మిగిలింది పుస్తకం.!

హననాలు ఖననాలు ఎన్ననను పోరులో
చరతకే రూపమై రగిలింది పుస్తకం.!

భువనాలు గగనాలు ఒక్కటా ఊహలో
హృదయాల నూయల్ల నూపింది పుస్తకం.!

పథములో గతుకులో నిస్తేజ కథలేల
శిలలైన శిల్పాలు మలిచింది పుస్తకం.!

గాయాలు గేయాలు వన్నెలే కలములో
శోధించి బోధిస్తే పలికింది పుస్తకం.! #వన్నెలయ్య_గజల్ 247 #గజల్ #పుస్తకం
కవనాల పవనాలు నింపింది పుస్తకం.!
భావాల గంధాలు పంచింది పుస్తకం.!

జననాలు మరణాలు చూశాను మట్టిలో
కాలాల సాక్ష్యమై మిగిలింది పుస్తకం.!

హననాలు ఖననాలు ఎన్ననను పోరులో
చరతకే రూపమై రగిలింది పుస్తకం.!

భువనాలు గగనాలు ఒక్కటా ఊహలో
హృదయాల నూయల్ల నూపింది పుస్తకం.!

పథములో గతుకులో నిస్తేజ కథలేల
శిలలైన శిల్పాలు మలిచింది పుస్తకం.!

గాయాలు గేయాలు వన్నెలే కలములో
శోధించి బోధిస్తే పలికింది పుస్తకం.! #వన్నెలయ్య_గజల్ 247 #గజల్ #పుస్తకం