Nojoto: Largest Storytelling Platform

రాలిన పూవులు వసుధను ముద్దాడినట్లు ఉన్నదిగా.! బిడ్డ

రాలిన పూవులు వసుధను ముద్దాడినట్లు ఉన్నదిగా.!
బిడ్డలందరిని దరణి దాచుకున్నట్లు ఉన్నదిగా!

చిమ్మడ మేమీ తక్కువ కాదని అమ్మ చెప్పిందేమొ
ఉదయం సూర్యుడు చీకటి ఊడ్చేసినట్లు ఉన్నదిగా.!

కనులతో కాదు సృష్టిని హృదయంతోనే చూడాలి
కురిసిన మేఘుడు నేలకు అలుకేసినట్లు ఉన్నదిగా.!

వెన్నెల రాత్రులు చూసిన రోజులు మరిచిపోతానా
చల్లని చంద్రుడు అగ్నిని రాజేసినట్లు ఉన్నదిగా.!

చచ్చిన కవి మది బ్రతికే ఉంది వన్నెల్లో చూస్తావ
చిగురుల సమాధి అడవిని స్వప్నించినట్టు ఉన్నదిగా.! #వన్నెలయ్య_గజల్ 345 #గజల్