అనవరతం మా కోసం కదిలినావు ఓ జననీ నిరంతరం మా క్షేమం తలచినావు ఓ జననీ నువ్వొంపిన ఘర్మజలం నేలతల్లి కభిషేకం మా కోసం తోటపనిలొ కరిగినావు ఓ జననీ నాన్నకేమి చెప్పలేని నా కోరిక లెన్నెన్నో నీ చెవితో పంచుకుంటె తీర్చినావు ఓ జననీ భారములను తుడిచేయగ హారములను అమ్మినావు గండాలను దాంటించి గెలిచినావు ఓ జననీ వన్నెలోన్ని మలిచినట్టి మాతృమూర్తి వందనమే నా కన్నుల దేవతవై వెలిగినావు ఓ జననీ #వన్నెలయ్య_గజల్ 116 #వన్నెలయ్య_అమ్మ #గజల్ #అమ్మ #మాతృదినోత్సవం శుభాకాంక్షలు💐💐💐🌷🌷🌷 #వన్నెలయ్య_ప్రత్యేక_రోజులు అమ్మ అంటే ప్రేమ అమ్మ అంటే శ్రమ అమ్మ అంటే ఓపిక అమ్మ అంటే దయ