వెన్నెలే పూసినా వెలుగేది లోకాన కన్నులే తెరిచినా ఫలమేది లోకాన అందమై కదిలినా నా చెలీ వీడితే అడుగులే కదిలినా చరితేది లోకాన ప్రాణమై నిండినా నా ప్రేమ ఓడితే పూవులే పూసినా రంగేది లోకానా ఆశలై రేపినా ఆమెనే తొలగితే ఊపిరే ఆడినా భవితేది లోకాన వేధనే నిండినా ప్రేమనే మిగిలితే బంధమే వేసినా మమతేది లోకానా వన్నెలే మలిచినా తనరూపు ఆడితే మణులనే చూసినా తళుకేది లోకాన #వన్నెలయ్య_గజల్ 89 #వన్నెలయ్య_విఫల_ప్రేమ_గజల్ #గజల్ #గజల్స్ #gazal #gazallove