Nojoto: Largest Storytelling Platform

ఆయుధమని మరిచావా సిగ్గు శరం విడిచావా ఆ నోటుకు ఓటేస్

ఆయుధమని మరిచావా
సిగ్గు శరం విడిచావా
ఆ నోటుకు ఓటేస్తివి..
తత్కాలం మురిసావా

మందు తాగి ఊగినావు
సందు గొందు తిరిగినావు
స్వార్థపరుని గెలిపించి..
నీ భవితను అమ్మినావు

నీ విజ్ఞత ఎటుపోయె
సంస్కారం ఎటుపోయె
ప్రలోభాలు చూపిస్తే
ముందుచూపు ఏమాయే

జనత బతుకు ఇంతేనా
పేదరికం చింతేనా
ఈ నేతల పాలనలో..
మార్పనేది అందేనా #వన్నెలయ్య_మణిపూసలు #మణిపూసలు #ప్రహేళిక
ఆయుధమని మరిచావా
సిగ్గు శరం విడిచావా
ఆ నోటుకు ఓటేస్తివి..
తత్కాలం మురిసావా

మందు తాగి ఊగినావు
సందు గొందు తిరిగినావు
స్వార్థపరుని గెలిపించి..
నీ భవితను అమ్మినావు

నీ విజ్ఞత ఎటుపోయె
సంస్కారం ఎటుపోయె
ప్రలోభాలు చూపిస్తే
ముందుచూపు ఏమాయే

జనత బతుకు ఇంతేనా
పేదరికం చింతేనా
ఈ నేతల పాలనలో..
మార్పనేది అందేనా #వన్నెలయ్య_మణిపూసలు #మణిపూసలు #ప్రహేళిక