Nojoto: Largest Storytelling Platform

అడుగు కదల కుండ మనసు పేల్చేదే ప్రేమ కాదా.!? బ్రతుకు

అడుగు కదల కుండ మనసు పేల్చేదే ప్రేమ కాదా.!?
బ్రతుకులోని కళలు నేల రాల్చేదే ప్రేమ కాదా.!?

ప్రాణమైంది వీడిపోతె గుండె పగిలి పోద
కన్నీటిని కురిపించీ ముంచేదే ప్రేమ కాదా.!?

వదిలి పోతె ఆగిపోతి గతకాలపు నీడలలో
వేదనాగ్ని సెగలలో కాల్చేదే ప్రేమ కాదా.!?

ప్రియుడి బ్రతుకు ఏమైనా ఆమె మనసు చూడదా
కలల కోట జాలిలేక కూల్చేదే ప్రేమ కాదా.!?

తన ధ్యానమె కర్తవ్యం శేష కాలమంతేగా..
వన్నెలయ్య లక్ష్య శుద్ధి ఊడ్చేదే ప్రేమ కాదా.!? #వన్నెలయ్య_గజల్ 219 #గజల్ #వన్నెలయ్య_విఫల_ప్రేమ_గజల్