Nojoto: Largest Storytelling Platform

Best వన్నెలయ్య_ప్రశంస Shayari, Status, Quotes, Stories

Find the Best వన్నెలయ్య_ప్రశంస Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 1 Followers
  • 28 Stories

Naresh Reddy Aleti

Dedicating a #testimonial to tejaswini patnaik పుట్టినరోజు శుభాకాంక్షలు తేజస్విని గారు💐💐💐 చాలా రోజుల నుండి అనుకుంటున్న మీ గురించి వ్రాయాలని.. ఈరోజు నెరవేరింది. మీ సాహితీ సేవ కొనసాగాలని కోరుకుంటూ శారదమ్మ కృప మీపై ఎప్పుడు ఉండాలని ప్రార్ధన చేస్తూ - నరేశ్ #వన్నెలయ్య_ప్రశంస

read more
కవితలతో సహవాసం
సమీక్షలతో తన స్నేహం
అందుకే ఆమె..
అక్షరాల స్రోతస్విని!

ఉపనిషద్ అధ్యయనం
ప్రతిరోజు స్వాధ్యాయనం
అందుకే ఆమె..
శ్రుతి శిఖర సంచారిణి!

తెలిసిన ప్రతీది వితరణం
తెలుగు తల్లి సాహితీ సేవనం
అందుకే ఆమె..
శారదమ్మ తేజస్విని! Dedicating a #testimonial to tejaswini patnaik
పుట్టినరోజు శుభాకాంక్షలు తేజస్విని గారు💐💐💐 

చాలా రోజుల నుండి అనుకుంటున్న మీ గురించి వ్రాయాలని.. ఈరోజు నెరవేరింది.
 
మీ సాహితీ సేవ కొనసాగాలని కోరుకుంటూ శారదమ్మ కృప మీపై ఎప్పుడు ఉండాలని ప్రార్ధన చేస్తూ
- నరేశ్ 
#వన్నెలయ్య_ప్రశంస

Naresh Reddy Aleti

Dedicating a #testimonial to sumana pranav అక్క కవిత్వం చూస్తె కవిత్వం అంటే ఇలా వ్రాయాలనిపిస్తుంది. భావపుష్టి, పదపుష్టి కావాల్సినంత ఉంటుంది.. ప్రకృతి ఐతే తన కవిత్వం లో ప్రాణం పోసుకుంటుంది. ఎల్లలు లేని తన కవితా భావ సుమాలు నా చిట్టి మదిలో నింపుకోవడం ఏరోజుకు సరిపోదు.. నా జీవితంలో ఐతే ఈలాంటి కవిత్వం చూడడం ఇక్కడే ప్రథమం.. ఏదో ధ్యానం చేసినట్టు అదేదో నిర్మల మందాకిని యదలో పారినట్టు #కలం #yqkavi #వన్నెలయ్య_ప్రశంస

read more
వైక్యూ చెట్టుపై తెలుగు కవితా కోకిల 'సుమన'

ఎన్ని హరివిల్లు రంగులు
నింపుకొచ్చిందొ తెలుగు..
తన భావనలో!

ఎంత ప్రకృతి పచ్చదనం
పూసుకొచ్చిందో తెలుగు
తన కవితలో!

ఎంతెంత కమ్మని సుస్పష్టత వాణీ సదనం నుండి
ఎత్తుకొచ్చిందో తెలుగు..
తన కలములో! Dedicating a #testimonial to sumana pranav
అక్క కవిత్వం చూస్తె కవిత్వం అంటే ఇలా వ్రాయాలనిపిస్తుంది.
భావపుష్టి, పదపుష్టి కావాల్సినంత ఉంటుంది..
ప్రకృతి ఐతే తన కవిత్వం లో ప్రాణం పోసుకుంటుంది.
ఎల్లలు లేని తన కవితా భావ సుమాలు నా చిట్టి మదిలో నింపుకోవడం ఏరోజుకు సరిపోదు..
నా జీవితంలో ఐతే ఈలాంటి కవిత్వం చూడడం ఇక్కడే ప్రథమం..
ఏదో ధ్యానం చేసినట్టు
అదేదో నిర్మల మందాకిని యదలో పారినట్టు

Naresh Reddy Aleti

Dedicating a #testimonial to Srijaparrot #వన్నెలయ్య_ప్రశంస

read more
విలువల బోధలు కలువల కవితలు
జగతిలొ గాధలు కలమున పదములు
          చదువగ అందరు కదలాలోయి!

పథమును తెలుపుతు కదిలెను అడుగులు
మంచిని చాటుతు మెదిలెను కరములు
          చూడగ అందరు రారండోయి!

మనసులు గెలిచే హితమగు రాతలు
సోదరి శ్రీజా పలికే మాటలు
          వినగా అందరు కూడండోయి! Dedicating a #testimonial to Srijaparrot 
#వన్నెలయ్య_ప్రశంస

Naresh Reddy Aleti

Dedicating a #testimonial to నవ జీవన ప్రియా కన్నా #వన్నెలయ్య_రుబాయిలు 86 #రుబాయిలు #రుబాయి #వన్నెలయ్య_ప్రశంస

read more

అన్యాయా న్నెదురిస్తూ ఆమె కలం కదులుతుంది
విప్లవాల భావాలను ఆమె గళం పలుకుతుంది
గరిట పట్టు ఆ చేతిలొ ఎర్రజెండ నేజూసా..
యద నిండిన విక్రాంతితొ ఆమె పథం నడుస్తుంది Dedicating a #testimonial to నవ జీవన ప్రియా కన్నా

#వన్నెలయ్య_రుబాయిలు 86 #రుబాయిలు #రుబాయి #వన్నెలయ్య_ప్రశంస

Naresh Reddy Aleti

Dedicating a #testimonial to Cherupalli Sandhya చెల్లి కవితలు.. గజల్లు చదువుతుంటే గలగలల సడి వినిపిస్తుంటుంది. చెల్లి కవితలు నాకు చాలా ఇష్టం. #వన్నెలయ్య_ప్రశంస

read more
తారల తేజం రాతలొ నింపే
వాస్తవ చిత్రం యదలలొ దింపే
          నేనో కవితా చదివొచ్చాను!

విద్దెల సుద్దుల బోధన చేసే
కవితల ప్రక్రియ వరదల పోసే
          నేనో కవినీ దర్శించాను!

గాజుల గలగల గజల్ల లీలా
భావపు చమకుల గుండెల డోలా
          నేనో "సంధ్య"లొ భావించాను!! Dedicating a #testimonial to Cherupalli Sandhya
చెల్లి కవితలు.. గజల్లు చదువుతుంటే గలగలల సడి వినిపిస్తుంటుంది.
చెల్లి కవితలు నాకు చాలా ఇష్టం.

#వన్నెలయ్య_ప్రశంస

Naresh Reddy Aleti

Dedicating a #testimonial to sumana pranav ఏక వచన ప్రయోగం చేసినందుకు మన్నించండి.. అక్కయ్య! ఋతురాణీ=వసంతం అగ్ని పూలు, రెల్లుపూలు, గుల్మొహర్ పూలు నాకు సుమన అక్క కవితల వలనే తెలిసాయి.. అంతకుముందు తెలియవు. అక్క కవితల గురించి ఎంత చెప్పిన తక్కువే తరువాత వ్రాస్తాను. #వన్నెలయ్య_ప్రశంస

read more
తెమ్మెరలను, తుంపరలను
హృది వాకిట జల్లునట్టి
కవితలేవొ చెప్పమంటు
మీరంతా నను కోరితె..
          సుమన సు-మన కవన ప్రకృతి
          తిప్పుకొస్త ఈరోజే!

అగ్ని పూలు, గుల్మొహర్లు
రెల్లుపూలు తెలియనట్టి
సుమ బాలల పరిచయాలు
చేయమంటు నన్నడిగితె
          సుమన కలము విరచించిన
          కవిత పూల తోటంతా చూపిస్తా ఈక్షణమే!

ఋతురాణీ, అంతర్వాణీ
సురు చిరు వాక్కుల వాణీ
బ్రతుకు పథం ఏదంటూ
నా ముందుకు కవులస్తే
          సుమన గమన జీవనమున ఒలికించిన
          కాంతి నిచ్చు దివ్య తలపు వినిపిస్తా ఈ పూట! Dedicating a #testimonial to sumana pranav
ఏక వచన ప్రయోగం చేసినందుకు మన్నించండి.. అక్కయ్య! 

ఋతురాణీ=వసంతం
అగ్ని పూలు, రెల్లుపూలు, గుల్మొహర్ పూలు నాకు సుమన అక్క కవితల వలనే తెలిసాయి.. అంతకుముందు తెలియవు.

అక్క కవితల గురించి ఎంత చెప్పిన తక్కువే తరువాత వ్రాస్తాను. 
#వన్నెలయ్య_ప్రశంస

Naresh Reddy Aleti

నా మిత్రుడి రెండో కూతురు. పేరు మోక్షప్రయా. ఈరోజు పుట్టిన రోజు.. శుభాకాంక్షలురా 🌷🌷 #వన్నెలయ్య_ప్రశంస

read more

ఒక్క చోట ఉండదే
లేడి పిల్ల చిన్నారి!
ఒక్క ఆట ఆడదే
మయూరీ పొన్నారి! నా మిత్రుడి రెండో కూతురు. పేరు మోక్షప్రయా.
ఈరోజు పుట్టిన రోజు.. శుభాకాంక్షలురా 🌷🌷
#వన్నెలయ్య_ప్రశంస

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_గజల్ 130 Dedicating a #testimonial to Swathi ✍️ స్వాతి గారి ఫ్రొఫైల్ చూడగానే "స్వాతి చినుకు" అంటూ రధీఫ్ తీసుకుని గజల్ రాద్దామని మొదలెట్టా... చివరికి ఈవిధంగా వచ్చిందీ... #గజల్ #గజల్లు #గజల్స్ #స్వాతిచినుకు #వన్నెలయ్య_ప్రశంస

read more
జాబిలమ్మ వెలుగులనే నింపిందొక స్వాతి చినుకు
చిన్ని చిన్ని ఆశలనే గెలిచిందొక స్వాతి చినుకు

తడబడు బుడి అడుగులతో వడివడిగా సాగెనదే
చిట్టి పాప అల్లరిలా సాగిందొక స్వాతి చినుకు

సింగిడిలో రంగులుగా కవిత పూలు వర్శిస్తూ
విలువలతో మనసు గొలుసు లాగిందొక స్వాతి చినుకు

వెతలెన్నో బ్రతుకులోన మరిపిస్తూ చలచల్లగ
యదను తాకి మంచువలే మెరిసిందొక స్వాతి చినుకు

కళలు వెలలు లేనిచోట తనరాకే సౌభాగ్యం
ఆణిముత్యమాల్చిప్పకు ఇచ్చిందొక స్వాతి చినుకు

చెలిమి చేయ చేయి కదిపి తడిపేసే తలపుతోట
రస హృదయం మొయిలులోన మొలిచిందొక స్వాతి చినుకు

చినుకు శోభ నింపుకునీ చదువరులకు పంచె చూడు
వన్నెలోడు కలమంచున మలిచిందొక స్వాతి చినుకు #వన్నెలయ్య_గజల్ 130
Dedicating a #testimonial to Swathi ✍️

స్వాతి గారి ఫ్రొఫైల్ చూడగానే "స్వాతి చినుకు" అంటూ రధీఫ్ తీసుకుని గజల్ రాద్దామని మొదలెట్టా...
చివరికి ఈవిధంగా వచ్చిందీ...
 #గజల్ #గజల్లు #గజల్స్ #స్వాతిచినుకు #వన్నెలయ్య_ప్రశంస

Naresh Reddy Aleti

Dedicating a #testimonial to Swathi ✍️ ఏకవాఖ్య సంభోదన తప్పలేదు...మన్నించాలి. #వన్నెలయ్య_ప్రశంస

read more
దొరికిందోచ్......
స్వాతి ముత్యం!

ప్రకృతమ్మ పాదాలకు పారాణి మీ కృతి
పలుకు లొలుకు, వేదికల పైన మీ దృతి!

దుశ్చర్యలను ఎండగట్టడం మీకలం రీతి
దెయ్యల కవితలకు పెరిగింది మీ ఖ్యాతి!

మీ కవనం చదువరులకు సానందా నుభూతి
మీ పద కాంతి స్పూర్తి పొందిన అడుగులలో అనుభాతి!

ఆకట్టుకునే అక్షరలతో పత్రికలలో నిలిచే మీ మూర్తి
దశ దిశల విస్తరించలేదా అపుడే మీ కీర్తి

వైక్యూ కి సపరివార పత్రికలా వస్తావు స్వాతి
రాసి కురిపిస్తావు అక్షర (దాసి) చినుకులు 'స్వాతి' Dedicating a #testimonial to Swathi ✍️ ఏకవాఖ్య సంభోదన తప్పలేదు...మన్నించాలి. 

#వన్నెలయ్య_ప్రశంస

Naresh Reddy Aleti

Dedicating a #testimonial to Mouni Kanna✍ ఉగాది (ప్లవనామ సంవత్సర శుభాకాంక్షలు అండి) #వన్నెలయ్య_ప్రశంస

read more
సుందరంగ మ్రోగే డోలిక
వైభవంగ తీర్చిన మాలిక
మౌనిక...
...నెమలిక!

సుద్దులు బోధించే రంగవల్లిక
బుద్దులు అందించే కవన మల్లిక
మౌనిక...
...మనస్విక!

విరహ భావలు అల్లుతున్న లతిక
వలపు కవితలు పాడుతున్న గీతిక
మౌనిక...
...కృష్ణ గోపిక! Dedicating a #testimonial to Mouni Kanna✍ 
ఉగాది (ప్లవనామ సంవత్సర శుభాకాంక్షలు అండి) 


#వన్నెలయ్య_ప్రశంస
loader
Home
Explore
Events
Notification
Profile