Nojoto: Largest Storytelling Platform

Best వన్నెలయ్య_కైతికాలు Shayari, Status, Quotes, Stories

Find the Best వన్నెలయ్య_కైతికాలు Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 1 Followers
  • 29 Stories

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_కైతికాలు #కైతికాలు #భారతి

read more
నీ వీణా నిక్వాణం
నా కైతలు కావాలి
నీ పదముల నిర్వాణం
నా కలమే వ్రాయాలి
ఓయమ్మో! భారతీ
మది హారతి నెత్తితీ #వన్నెలయ్య_కైతికాలు #కైతికాలు  #భారతి

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_కైతికాలు #కైతికాలు #భారతి

read more
ప్రణవ నాద సుధా సమం
ఆ వీణా సంగీతం
శృతీ శిఖర సంచారం 
ఆ కరముల సాహిత్యం
వారెవ్వా భారతీ
నీ పదములు పట్టితి #వన్నెలయ్య_కైతికాలు #కైతికాలు #భారతి

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_కైతికాలు #కైతికాలు

read more
నా కోమలి బంగారం
పెట్టింది సింధూరం
మేనంతా సింగారం
నడకలోన వయ్యారం
వారెవ్వా నా రాణీ
అందాలకు విరిబోని #వన్నెలయ్య_కైతికాలు #కైతికాలు

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_కైతికాలు #కైతికాలు

read more
దారేమో తప్పుగా
నడకేమో వంకరా
నలుపు తాడు కట్టగా
దిష్టి ఎలా పోవురా
అయ్యయ్యో! ఆ దారం
అభ్యుదయం ఇక దూరం #వన్నెలయ్య_కైతికాలు #కైతికాలు

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_కైతికాలు #కైతికాలు #వసంతం

read more
మోదుగులే విలసిల్లీ
బూరుగులే పుష్పించే
కొండ గోగు నవ్వేస్తే
పొన్న చెట్లు శోభించే
వారెవ్వా ఆ అందం
వాసంతపు మకరందం #వన్నెలయ్య_కైతికాలు #కైతికాలు #వసంతం

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_కైతికాలు #కైతికాలు #పచ్చనిపిలుపు #సమస్యాపూరణ134 #వనం #వనంవసంతం #వనం

read more
చిట్టి మొక్క నాటేందుకు
చేయి చేయి కలుపుదాం
అడివెంతో పెరిగేందుకు
ప్రతీ భుజం తట్టుదాం
వారెవ్వా ఈ పథము
నిర్మించును సిరుల వనము #వన్నెలయ్య_కైతికాలు #కైతికాలు #పచ్చనిపిలుపు #సమస్యాపూరణ134 #వనం #వనంవసంతం #వనం

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_కైతికాలు #కైతికాలు తడెబడే అడుగులకు నిలబడే తోడుగా కనబడని దైవాలకు ఎదురుపడే మారుగా వారెవ్వా కన్నతల్లి కళ్ళముందు కల్పవల్లి

read more
తడెబడే అడుగులకు
నిలబడే తోడుగా
కనబడని దైవాలకు
ఎదురుపడే మారుగా
వారెవ్వా కన్నతల్లి
మనసు చూడ పాలవెల్లి #వన్నెలయ్య_కైతికాలు #కైతికాలు 
తడెబడే అడుగులకు
నిలబడే తోడుగా
కనబడని దైవాలకు
ఎదురుపడే మారుగా
వారెవ్వా కన్నతల్లి
కళ్ళముందు కల్పవల్లి

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_కైతికాలు #కైతికాలు

read more
వాకిట్లో నిలిచింది
ఆరోగ్యం పంచింది..
గాలిలో నిండింది
ఆయుష్షు పెంచింది..
వారెవ్వా తులసమ్మ
నీ విభవము తెలుసమ్మ! #వన్నెలయ్య_కైతికాలు  #కైతికాలు

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_కైతికాలు #కైతికాలు

read more
చేతలన్ని ఆపినావు
చేతిగీత చూసినావు
అడుగు కదపకున్నావు
దుర్ముహూర్తమన్నావు
అబ్బబ్బో జ్యోతిష్యం..
అధోగతి నీ విషయం! #వన్నెలయ్య_కైతికాలు #కైతికాలు

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_కైతికాలు #వన్నెలయ్య_ప్రత్యేక_రోజులు #తెలంగాణవిమోచనదినోత్సవం #తెలంగాణ

read more
పెత్తందార్లను ప్రశ్నించి
దొరలందరిని నిలదీసె
అన్యాయాలు నిరసించి
ఉద్యమాలను సృష్టించె
వారెవ్వా! తెలంగాణ
తిరగబడిన ఖార్కాన #వన్నెలయ్య_కైతికాలు #వన్నెలయ్య_ప్రత్యేక_రోజులు #తెలంగాణవిమోచనదినోత్సవం #తెలంగాణ
loader
Home
Explore
Events
Notification
Profile