Nojoto: Largest Storytelling Platform

Best తను Shayari, Status, Quotes, Stories

Find the Best తను Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about తనువు meaning in telugu, తనువా హరిచందనమే, తనుజ, తనకు, తనువు అర్థం,

  • 3 Followers
  • 24 Stories

srilatha lion

#తను #🖤...

read more
దట్టమైన అడవి

చిక్కటి చీకటి

తన పిడికిలి నుండి విదిలించుకునెళ్ళిన
ఓ‌ చూపుడువేలు! #తను #🖤...

srilatha lion

#తను

read more
అతను : ఏమైంది?!

    తను : చెబితే చరిత్ర
              రాస్తే అంతులేని కథ #తను

srilatha lion

అంతా చీకటి కొద్ది కొద్దిగ ఇంకో గదిలోని లైట్ ఫోకస్ పడుతుండటంతో కాస్త వెలుగు.. తను తప్ప నిద్రావస్థలో అందరూ.. వినిపించీ,వినిపించనట్టుగ దూరంగ ఎక్కడో కుక్కల అరుపులు చిన్నగా వినిపిస్తుంటే.... గదిలో ఓ మోస్తరుగ తిరుగుతున్న ఫ్యాను శబ్దం మాత్రం స్పష్టంగా వినిపిస్తూ తన గుండె దడతో తాళమేస్తుంది. తనేమో కిటికిలోనుండి కనిపించీ, కనిపించని నల్లని ఆకాశాన్ని సరిగ్గా చూసే వీల్లేక గది నాలుగ్గోడలే ప్రపంచమన్నట్టు తదేకంగా చూస్తూ దీర్ఘాలోచనల్లో,ఆందోళనల్లో చిక్కుకుపోతుంది. #Telugu #మనసు #teluguvelugu #yqkavi #వరం #కన్నీటిశబ్దం

read more
అప్పుడనుకుంది తను 
మనసుకి వరమైంది 
కన్నీటికి శబ్దం లేకపోవడం వల్లని... అంతా చీకటి 
కొద్ది కొద్దిగ ఇంకో గదిలోని లైట్ ఫోకస్ పడుతుండటంతో 
కాస్త వెలుగు..
తను తప్ప నిద్రావస్థలో అందరూ..
వినిపించీ,వినిపించనట్టుగ దూరంగ ఎక్కడో కుక్కల అరుపులు చిన్నగా వినిపిస్తుంటే....
గదిలో ఓ మోస్తరుగ తిరుగుతున్న ఫ్యాను శబ్దం మాత్రం స్పష్టంగా వినిపిస్తూ తన గుండె దడతో తాళమేస్తుంది.
తనేమో కిటికిలోనుండి కనిపించీ, కనిపించని నల్లని ఆకాశాన్ని సరిగ్గా చూసే వీల్లేక గది నాలుగ్గోడలే ప్రపంచమన్నట్టు తదేకంగా చూస్తూ  దీర్ఘాలోచనల్లో,ఆందోళనల్లో చిక్కుకుపోతుంది.

srilatha lion

#తను #మౌనం #Telugu #teluguvelugu #yqkavi

read more
తను మాట్లాడుతుంది 

మౌనంతో...మౌనంగా! #తను #మౌనం #telugu #teluguvelugu #yqkavi

srilatha lion

#రాతిరి #తను #Telugu #teluguvelugu #మాస్కు

read more
రాతిరికి తీసేస్తుంది తను
పగలంతా పెట్టుకోలేక ఇబ్బందిపడే 
"బావుందన్న మాస్కు"  #రాతిరి #తను #telugu #teluguvelugu #మాస్కు

srilatha lion

#ఒంటరితనం #beautyinmyvision #తను #మాటలు #Telugu #teluguvelugu

read more
ఒంటరితనం మాటాడినంతగ
తనతో ఇంకెవరు మాటాడరనుకుంటా! #ఒంటరితనం #beautyinmyvision #తను #మాటలు #telugu #teluguvelugu

srilatha lion

#హోళీ #తను #Telugu #teluguvelugu

read more
రోజు హోళీనే...
తనొచ్చింది మరి! #హోళీ #తను #telugu #teluguvelugu

srilatha lion

#తను #తింగరబుచ్చి #Telugu #మానసచోరి #అద్భుతం

read more
తిడితే మురిసిపోతూ
చూస్తూనే తృప్తిపడిపోతూ
చూసినపుడల్లా తననో అద్భుతంలా ఆస్వాదిస్తూ  
కనులారా తనని నింపేసుకునే తింగరబుచ్చి...
మనసారా ప్రేమతో ఆరాధించే మానసచోరి... #తను #తింగరబుచ్చి #telugu #మానసచోరి #అద్భుతం

srilatha lion

#తను #మనసుచప్పుడు #మౌనరాగం #Telugu

read more
ప్రపంచం పడుకుంది 
తన అరుపులు వినిపించవులే...
ప్రపంచం మేలుకుంది
తన విచారం గుర్తించబడదులే... 
తనకు ప్రపంచానికి చాలా దూరం. 
మధ్యలో ఓ ప్రపంచం ఉంది
గాలిమేడనెక్కిస్తూనే
పాతాళానికి పడదోస్తూ...
పూలను చూపిస్తూనే ముళ్ళను పరుస్తూ...
జీవం నాటకం 
జీవితం బూటకం
ఎండమావులకై పడిగాపులు
ఎదలాలసకై కన్నీటిఅడుపులు
ఊహావిహారి సమాయాహారి 
మిథ్యానగరి తనుప్రహరి
పరువుకు వేలం భవిత
అరువుకు గాలం కవిత
వేదాంత వెక్కిరింత 
ఆద్యంత కలవరింత
మనసుకు ముసుగును కుట్ట వాసమేది!
కనుతలుపులకు తాళమేయ ఉపాయమేది?
అయోమయం తనతో 
ఆందోళన తనలో
ఆవేదన తనై పుట్టిపెరిగి 
కాలం కథలో కదులుతూ
తన కథలో తనని తొక్కుతూ
గమ్యం వైపు పరుగు 
గాయమైంది అరుగు 
ముళ్ళు మిగిలిన కాడ 
నేలకొరిగిన గులాబీరేకుల్తో తను...
- srilatha lion💘 #తను #మనసుచప్పుడు #మౌనరాగం #telugu

srilatha lion

#నీకనులు #తను #Telugu

read more
తను చిన్నబుచ్చుకుంటుంది 
నీ కనులు తనని తప్ప ఇంకేం చూసినా... #నీకనులు #తను #telugu
loader
Home
Explore
Events
Notification
Profile